రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

 

నందికొట్కూరు  అక్టోబర్ 19 (globelmedianews.com)
ప్రజల రక్షణకై ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నందికొట్కూరు  సర్కిల్ పోలీస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన  శిబిరాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగరు ఆర్థర్  ప్రారంభించారు. విధి నిర్వహణలో అమరులైన మన వీర జవాన్లను, పోలీస్ సిబ్బంది కి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విది నిర్వాహణలో  భాగంగా పోలీస్ శాఖ, సిబ్బంది నిర్వహిస్తున్న సేవలను కొనియాడారు. 
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వారి సేవలను గుర్తించాలని, ప్రజా రక్షణలో ప్రాణాలు సైతం అర్పించారనారు. సమాజ సేవ లో తాను సైతం ముందు౦ట్టానని, తాను ప్రతి సంవత్సరం ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నాడు రక్త దానం చేస్తున్నానని, నేడు ఒక ప్రజా ప్రతినిధిగా రక్త దానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నందికొట్కూరు పోలీస్ స్టేషన్ మౌలిక సదుపాయాల నిమిత్తం తన ఎమ్మెల్యే  నిధుల నుండి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో, పట్టణ యువకులు, ప్రముఖులు, పోలీసులు, జర్నలిస్టులు ప్రజాప్రతినిధులు రక్తదానం చేసి అమరవీరుల త్యాగాలను కొనియాడారు.

No comments:
Write comments