అలంకార ప్రాయంగా మోడల్ హౌస్

 

మెదక్, అక్టోబరు 2, (globelmedianews.com)
నిరుపేదల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మోడల్‌ హౌస్‌లు అలంకారప్రాయంగా మిగిలాయి. కొన్ని అసంపూర్తిగా వదిలేయగా మరికొన్ని నిర్మాణం పూర్తై నిరుపయోగంగామారాయి. శిథిలావస్థకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వెరసి అనుకున్న లక్ష్యం నాణ్యతతో కూడిన ఇల్లు ఎలా కట్టుకోవాలో లబ్ధిదారులకు చాటిచెప్పేందుకు ఈ భవనాలు నిర్మించారు. జిల్లా వాప్తంగా 2012–13లో మండలాల్లో మోడల్‌ హౌస్‌ల నిర్మాణానికి హౌసింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేశారు. ఒక్కోభవనానికి రూ.1.50 లక్షలు వెచ్చించి పూర్తి నమూనా ఇళ్లను నిర్మించాల్సిందిగా అధికారులు నిర్ణయించారు. తర్వాత గ్రామాలకు విస్తరించాలనుకున్నారు. 
అలంకార ప్రాయంగా మోడల్ హౌస్

మొదట్లో పనులు బాగానేకొనసాగాయి. 80శాతం వరకు పూర్తి చేశారు కూడా. మిగతా పనులు కూడా పూర్తి చేసి హౌసింగ్‌ శాఖ మండల కార్యాలయంగా ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీచేసింది.2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్థానంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని తీసుకువచ్చింది. హౌసింగ్‌ శాఖను కూడా పూర్తిగారద్దు చేసి సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేసింది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లోనిర్మాణం చేపట్టిన మోడల్‌ హౌస్‌ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వీటికి కరెంట్‌ సరఫరా, వైరింగ్, తలుపులు, కిటికీల బిగింపు, పెయింటింగ్‌ వేయడం వంటి పనులుచేపట్టకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయాయి.ఒక్కో భవనానికి కేవలం రూ.1.50లక్షలు ఖర్చు చేసి ఒక కుటుంబం ఉండేందుకు వీలుగా బెడ్‌రూం, హాల్, కిచెన్, వరండాతోసహా ఎలా కట్టుకోవాలో నిర్మించి మరీ చూపించారు. అంతా బాగానే ఉన్నా ఈ భవనాలు పూర్తై దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నాయి.జిల్లా వ్యాప్తంగా కోట్లాదిరూపాయాలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాల పనులు ఇంకా పూర్తికాకపోవడంతో నిరు పయోగంగా మారాయి. వాటిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో శిథిలావస్థకు చేరు కుంటున్నాయి. చాలా మండలాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మందు బాబులు, పేకాట రాయుళ్లకు రాత్రివేళ సిట్టింగ్‌ కోసం ఉపయోగపడుతున్నాయి. మరి కొన్ని మండలాల్లో ఇతర శాఖల అధికారులు వీటిని స్టోర్‌ రూంలుగా వాడుకుంటున్నారు. మరిన్ని నిధులు వెచ్చించి భవనాలను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:
Write comments