క్యాబ్స్ లో సెక్యూరిటీ సిస్టమ్

 

హైద్రాబాద్, అక్టోబరు 12, (globelmedianews.com)
ప్రయాణికుల భద్రత కోసం పోలీస్ డిపార్ట్ మెంట్ మరో వినూత్న టెక్నాలజీకి శ్రీకారం చుట్టుంది. ప్రైవేట్ క్యా బ్స్, టీఎస్ టూరిజం బస్సుల్లో ప్రయాణించే వారి సెక్యూరిటీ కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ప్రారంభించింది. ప్రైవేట్ క్యా బ్ సర్వీసెస్ యాప్స్ తో కనెక్ట్ చేసిన ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను లాంచ్ చేశారు. ప్రయాణికుల సేఫ్ జర్నీపై ఫోకస్ దేశంలోనే సేఫ్ అండ్ సెక్యూ ర్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ లో మహిళా భద్రతకు పోలీసులు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోన్న గ్రేటర్ లో క్యా బ్ ప్రయాణికుల సేఫ్ జర్నీపై ఫోకస్ పెట్టారు. దీంతో పాటు మహిళా సెక్యూ రిటీ కోసం ఇప్పటి కే షీటీమ్స్, భరోసా, హాక్ ఐ లాంటి మొబైల్ యాప్స్ అందుబాటులోకి తెచ్చారు. ఎస్ఓఎస్ సిస్టంతో కనెక్టైన హాక్ ఐ తో పోలీసులు మంచి ఫలితాలు సాధిం చారు. 
క్యాబ్స్ లో సెక్యూరిటీ సిస్టమ్

సుమారు 22 లక్షల మంది ఈ యాప్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాక్ ఐతో పోలీస్ పెట్రో, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో పాటు పోలీస్ యాప్స్ అనుసంధానం చేయడంతో నిమిషాల వ్యవధిలోనే సిటి జన్లకు పోలీసులు మెరుగైన సేవలు అందిస్తున్నారు.హాక్ ఐతో విస్తృ త ప్రయోజనాలు ఉండడంతో పోలీస్ యాప్స్ తో ప్రైవేట్ క్యా బ్స్ అనుసంధానంచేశారు. ఇందులో ఓలా, టోరా, మూవ్ ఇన్ సింక్, టీఎస్ టూరిజం యాప్స్ ను పోలీస్ పెట్రోయాప్ కి కనెక్ట్ చేశారు. క్యా బ్స్ లో ప్రయాణిం చే వారికి ప్రమాదం వాటిళ్లుతుం దనే అనుమానం వస్తేక్యా బ్ సర్వీసెస్ యాప్స్ లోని ‘ఎమర్జెన్సీ బటన్’ ప్రెస్ చేయాలి. దీంతో క్యా బ్ సర్వీసెస్ తో కనెక్టైనపోలీస్ యాప్స్ కి సమాచారం వెళ్తుం ది. పెట్రో పోలీస్ తో పాటు స్థానిక బ్లూ కోల్ట్స్, పోలీస్ స్టేషన్,ఏసీపీ, జోనల్ డీసీపీలకు సమాచారం వెళ్తుందిక్యాబ్ సర్వీసెస్ డేటాతో లింక్ చేసిన వివరాలు కమాండ్ అండ్ కంట్రోల్ రూం నుంచి క్యా బ్డ్రైవర్, నంబర్ తో పాటు క్యా బ్ లొకేషన్ పోలీసుల చేతుల్లో ఉంటుంది. దీంతో క్యా బ్ ఎక్కడ ఉన్నానిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయొచ్చు. ఇలా ఆపదలో ఉన్న క్యాబ్ ప్రయాణికులను కాపాడేందుకు పోలీసులు ప్రణాళికలు రూపొందించారు. దీంతో పాటు థర్డ్ పార్టీ కాల్ సెంటర్ తో ఫీడ్ బ్యాక్తీసుకుని ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ సిస్టం సేవలను మెరుగుపరుస్తామని డీజీపీ తెలిపారు.

No comments:
Write comments