టీడీపీ ఓట్లపై ట్రోలింగ్స్

 

నల్గొండ, అక్టోబరు 25 (globelmedianews.com)
తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 43వేల పైచిలుకు ఓట్లతో తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. ఇక బీజేపీ, టీడీపీలు డిపాజిట్లు కోల్పోయాయి. ఇప్పుడు హుజూర్‌నగర్‌లో టీడీపీకి వచ్చిన ఓట్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. హుజూర్ నగర్‌లో టీడీపీకి వచ్చిన ఓట్లన.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్లతో పోలుస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. నెటిజన్లతో పాటూ మరికొన్ని పార్టీ నేతలు పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
టీడీపీ ఓట్లపై ట్రోలింగ్స్

వైఎస్సార్‌సీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) టీడీపీపై సెటైర్లు పేలుస్తూ ఓ ట్వీట్ చేశారు. హుజూర్ నగర్ లో తెలుగుదేశం కి వచ్చిన ఓట్లు 1895. 1+8+9+5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23’అంటూ ట్రోల్ చేశారు.హుజూర్ నగర్ లో తెలుగుదేశం కి వచ్చిన ఓట్లు 1895. 1+8+9+5 = 23.ఓటమిని తెలుగుదేశాన్ని  అనుసంధానించేది  23.పీవీపీ ట్వీట్ ప్రకారం.. హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన చావా కిరణ్మయికి 1,895 ఓట్లు వచ్చాయి. ఈ అంకెలన్నీ (1+8+9+5) కలిపితే 23 వస్తుందని ఎద్దేవా చేశారు. ఆ 23 కూడా ఏపీలో టీడీపీ గెలుచుకున్న సీట్లని ట్రోల్ చేశారు. అయితే పీవీపీ చెప్పిన లెక్కలో తేడా ఉందని నెటిజన్లు కూడా కౌంటర్ ఇస్తున్నారు. హుజూర్‌నగర్‌లో టీడీపీకి వచ్చింది 1827 ఓట్లని ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కను ట్వీట్ చేస్తున్నారు.

No comments:
Write comments