ఉత్తర కర్ణాటకకు మరోసారి భారీ వర్షాలు

 

బెంగలూరు  అక్టోబర్ 21 (globelmedianews.com)
ఉత్తర కర్ణాటకకు మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం తో మలప్రభ నదీ తీరంలో హెచ్చరికలు జారీ చేశారు. సుమారు ఆరేడు గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉన్నందున బెళగావి జిల్లాధికారి పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించారు. 
ఉత్తర కర్ణాటకకు మరోసారి భారీ వర్షాలు

బెళగావి వ్యాప్తంగా వర్షంహోరుతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. సవదత్తి తాలూకాలోని నవిలుతీర్థ జలాశయం నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బెంగళూరులోనూ వర్షం హోరు తీవ్రంగా ఉంది. రెండు నెలలక్రితం బెళగావిని వరదలు ముంచెత్తగా మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది.

No comments:
Write comments