జగన్ జాగీర్ ఏం కాదు : చంద్రబాబు

 

విజయవాడ, అక్టోబరు 2 (globelmedianews.com)
రాష్ట్రం జగన్ సొంత జాగీర్ కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చట్టాలను చుట్టంగా మార్చుకొని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అందరూ అవినీతిపరులు.. తానొక్కడినే నీతిమంతుడు.. అన్నట్లు జగన్ వ్యవహారరిస్తున్నారని విమర్శించారు. గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని.. పోలీసులను పెట్టి మరీ మద్యం అమ్మిస్తూ ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 
జగన్ జాగీర్ ఏం కాదు : చంద్రబాబు

గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు జగన్ సర్కార్ పాలనపై మండిపడ్డారు.రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని.. బ్రిటీష్‌ వారైనా చట్టాన్ని అనుసరించేవారని.. జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ఇప్పటికి తేల్చలేకపోయారని.. అలా ఉంది పాలన అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2003లోనే గ్రామ సచివాలయ వ్యవస్తను ప్రారంభించామని.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కొత్తగా చేసిందేమీ లేదన్నారు.

No comments:
Write comments