సినిమాకు పోయిన ఎస్సైలకు స్థానచలనం

 

కర్నూలు   అక్టోబర్ 02  (globelmedianews.com)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాకు వెళ్లిన ఎస్సైలపై కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం  వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు‘సైరా’ సినిమాకు వెళ్లారు. అయితే విధుల్లో ఉండి.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లారంటూ వారిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలు తీసుకున్నారు. 
సినిమాకు పోయిన ఎస్సైలకు స్థానచలనం

వెంటనే ఆఆరుగురు ఎస్సైలను వీఆర్కు బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. కర్నూలు ల్ డిపివో కు వచ్చి కలవాలని ఆదేశించారు. నంద్యాల డివిజన్ లోని ముగ్గురు డిఎస్పీ లను కుడాఅయన మందలించినట్లు సమాచారం.

No comments:
Write comments