ఫుల్ జోష్ గా మద్యం వ్యాపారులు

 

హైద్రాబాద్, అక్టోబరు 12, (globelmedianews.com)
రెండేళ్ల కింద మద్యం లైసెన్సులు పొందిన వ్యాపారులందరికీ బాగా కలిసొచ్చింది. వరుస ఎన్నికలతో పాటు మూడేళ్లుగా దసరా పండుగ కూడా కలిసొచ్చింది. ఈ రెండెళ్లలోనే రూ. 40,800 కోట్ల విక్రయాలు జరగడం గమనార్హం. రాష్ట్రం లో అతిపెద్ద పండగ దసరా. ఈ సంధర్భంగా ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరుగుతాయి.సేల్ రెట్టిం పు అవుతుంది. అయితే అదే సమయంలో మద్యం కొరత కూడ ఏర్పడుతుంది. పైగా ఈ నెలతో లైసెన్స్ గడువు ముగుస్తుందని, మద్యం వ్యాపారులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మద్యం ధరల ను తమకు ఇష్టం వచ్చినట్టు పెంచి అమ్ముతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి మద్యం రేట్లను డబుల్ చేస్తున్నారు. 
ఫుల్ జోష్ గా మద్యం వ్యాపారులు

దీంతో ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత మద్యం వ్యాపారుల పాలిట వరుస ఎన్నికలు వరంగా మారాయి. 2018 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. అప్పటి నుంచి ఎన్నికల సీజన్ మొదలైంది. డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు, 2019 జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు, ఏప్రిల్ పార్లమెంటు ఎన్నికలు, ఎంపిటిసి, జెడ్‌పిటిసిల ఎన్నికలు, ఎంఎల్‌సిల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. ఇక ఈ దసరా ఆదాయం కూడా వీరి ఖాతాల్లో చేరనుంది.రెండేళ్లుగా ఉన్న తమ మద్యం దుకాణాల గడువు ముగుస్తున్నందున పలువురు వ్యాపారులు కల్తీ దందాకు తెరతీశారనే చర్చ జరుగుతున్నది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడితో ముందుకెళ్తున్నట్లు తెలిసింది. అందుకే అధిక ధర కలిగిన మద్యం సీసాల్లో చీప్ లిక్కర్, నీటిని నింపి విక్రయిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇటీవల సిద్దిపేటలోని ఓ మద్యం దుకాణంలో ఈ కల్తీదందా వెలుగు చూసింది.ఎమ్‌ఆర్‌పి కంటే ఎక్కువ ధరలకు అమ్మిన వారికి రూ.2 లక్షలు జరిమానాను విధించడంతోపాటు వారం రోజు ల పాటు వైన్‌షాపుల లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తామని తెలంగాణ వైన్‌షాపుల యాజమానులను హెచ్చరించింది. ఇలా గత రెండు రోజులుగా ఎక్కువ ధరలకు అమ్మి న ఎనిమిది వైన్ షాపులను పలు జిల్లాల్లో గుర్తించిన ప్రత్యేక టీంలు గుర్తించి పట్టుకున్నాయి. వీరిపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పండగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్ షాపు య జమాని ప్రయత్నించినా చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లకు అదనంగా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌ఫోర్స్ టీంలు నాలుగు, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు 10, జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్స్ 34 ఏర్పాటు చేసినట్లు తెలిపిం ది. ఎమ్‌ఆర్‌పికి మించి ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సంబంధిత ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చునన్నా

No comments:
Write comments