ఇప్పటికి,ఎప్పటికి పాటించతగినది ఆయుర్వేదం

 

నిజామాబాద్ అక్టోబర్ 25 (globelmedianews.com):
పూర్వకాలం నుంచి ఆయుర్వేదాన్ని మన దేశంలో పాటిస్తున్నామని అది ఇప్పటికి కూడా పాటించతగిందేనని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుర్వేద వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్ మైదానంలో జిల్లా కలెక్టర్ ఆయుర్వేద వాక్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధన్వంతరి జయంతి సందర్భంగా ఈరోజు దేశంలో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. పూర్వ కాలం నుండి ఆయుర్వేద, యూనాని, సిద్ధ వైద్య విధానాలను మనం పాటించి ఆరోగ్యాలను కాపాడుకున్నామన్నారు. 
ఇప్పటికి,ఎప్పటికి పాటించతగినది ఆయుర్వేదం

అయితే వీటికి కాలానుగుణంగా ఆదరణ తగ్గిందని దీర్ఘకాలిక రోగాలకు శాశ్వత పరిష్కారం కల్పించే ఈ వైద్యంపై ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. వంటింట్లో ఉండే వస్తువులు, ఇంటి పెరట్లో పెరిగే మొక్కల్లో కొన్నింటిలో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని వాటి పనితీరును తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. జిల్లాలో 42 ఆయు డిస్పెన్సరీలు ఉన్నాయని వాటిల్లో లభించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఆయుర్వేద విభాగం కో-ఆర్డినేటర్ రమణ మోహన్, వారోత్సవాల ఇంచార్జ్ గంగాదాస్, కో కన్వీనర్ గోవర్ధన్, ఆర్య సమాజ్, పతంజలి ఇతర సమస్యల ప్రతినిధులు డాక్టర్లు, అధికారులు, సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments