బంగ్లాదేశ్ లో కోస్ట్ గార్డ్ లకు చిక్కిన

 

మత్స్య కారులను  స్వదేశానికి రప్పించండి
-కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శికి ఎంపీ ఎంవీవీ వినతి
- అవసరమైతే బంగ్లాదేశ్ వెళ్లి కార్యాచరణ చేపట్టేలా ముందుకు సాగుతామని స్పష్టం
న్యూ ఢిల్లీ అక్టోబరు 22, (globelmedianews.com)
అవసరమైతే బంగ్లాదేశ్ వెళ్లి కోస్ట్ గార్డ్ అధీనంలో ఉన్న మత్స్య కారులను విడిపిస్తానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ   అన్నారు.న్యూఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా విదేశీవ్యవహారాల శాఖామంత్రి వ్యక్తిగత కార్యదర్శి  జై శంకర్ ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దురదృష్టవశాస్తూ బంగ్లాదేశ్ సరిహద్దులో వేటకు వెళ్లి చిక్కుకున్న మత్స్య కారులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నం ముమ్మరం చేస్తున్నామన్నారు. 
బంగ్లాదేశ్ లో కోస్ట్ గార్డ్ లకు చిక్కిన

ఈ నేపథ్యంలో గతంలో పలు మార్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపామన్నారు.ఈ క్రమంలో మరింత చొరచూపి వారిని ,సాధ్యమైనంత త్వరగా భారతదేశం రప్పించాలని కోరామన్నారు. ఈ విషయంపై తాము వినతిపత్రం ఇవ్వగా జై శంకర్ సానుకూలంగా స్పందించారన్నారు.కార్యదర్శిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ మత్స్య కార యువజన సమైఖ్య రాష్ట్ర అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్, డొమెస్టిక్ ట్రెడిషనల్ ఫిష్ వర్క్ ఫోరమ్  నాయకులు డి.పాల్ ,బోట్ యజమాని వాసుపల్లి రాము తదితరులు ఉన్నారు

No comments:
Write comments