ప్రైవేటీకరణకు సిపిఎం పార్టీ వ్యతిరేకం

 

వనపర్తి అక్టోబర్ 22  (globelmedianews.com)
ప్రైవేటీకరణ కు సిపిఎం పార్టీ వ్యతిరేకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోల  సందర్శనలో భాగంగా మంగళవారం  ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వనపర్తి  ధర్నాచౌక్ లో  ఆయన మాట్లాడారు  ప్రభుత్వ  రంగ సంస్థ ఆర్టీసీ ప్రైవేటీకరణ  ను అందుకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు .నిజామునవాబు కోడలు రెండు వేల కోట్ల కట్నం డబ్బుతో తెలంగాణలో ఆర్టిసి ఏర్పడిందన్నారు .కార్మికులు కండలు కరిగించి ఆర్టీసీ ఆస్తులు కూడబెట్టడం జరిగిందన్నారు .
ప్రైవేటీకరణకు సిపిఎం పార్టీ వ్యతిరేకం

ఈ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రతోనే కార్మికులతో చర్చలు జరగడం లేదన్నారు .కోర్టుకు అన్ని అబద్దాలే చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజా రవాణా ఎంతో చక్కగా ఉందన్నారు. ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు .అందుకే ప్రజలంతా ఆర్టీసీ సమ్మె కు మద్దతు పలికారు అన్నారు. తెలంగాణలో ఈ స్థాయిలో బందు జరగడం అపూర్వ మన్నారు. కేసీఆర్ దిగకుంటే ఈ నెల  30న సకలజనుల సమరభేరి లో సంగతి తేలుస్తా మన్నారు కార్మికులు ధైర్యం కోల్పోకుండా పరిష్కారం అయ్యేదాకా పోరాడాలన్నారు తెలంగాణ సమాజమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులది పోరాట చరిత్ర అన్నారు వారు లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని గుర్తు చేశారు ప్రజలందరూ ఏకమై పోరాడుతున్న కేసీఆర్ స్పందించడం లేదని గద్దె దించడం ఖాయమన్నారు.

No comments:
Write comments