వైకాపా వేధింపులపై రాజీ లేని పోరాటం

 

అమరావతి అక్టోబర్ 29 (globelmedianews.com)
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వంశీ రాజీనామాపై పలువురు టీడీపీ ముఖ్య నేతలు స్పందించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ లేఖ రాయడం.. ఆయన రిప్లై ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. తాజాగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వంశీ వ్యవహారంపై చంద్రబాబు మరోసారి మాట్లాడారు.
వైకాపా వేధింపులపై రాజీ లేని పోరాటం

వైసీపీ ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలి. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సరెండర్ పాలిటిక్స్ చేస్తున్నారు. వంశీని లొంగదీసుకోవాలని కావాలనే తప్పుడు కేసు పెట్టారు. వంశీ ఏం నేరం చేశాడని కేసు పెట్టారు?. వంశీపై కేసు పెట్టడం కాదు.. ఎమ్మార్వో, ఎస్సైని అరెస్ట్ చేయాలి. అచ్చెన్న, కూన రవి, సోమిరెడ్డి, యరపతినేనిపై కేసులు పెట్టారు. కోడి కత్తి కేసు ఏమైంది?. సొంత బాబాయి వివేకా కేసును ఏం తేల్చలేకపోయారు’ అని జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్పై మాట్లాడిన బాబు.. టీడీపీ చేసిన అభివృద్ది పనులన్నీ రివర్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

No comments:
Write comments