మహిళ కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నం

 

మంచిర్యాల అక్టోబర్ 18 (globelmedianews.com)    
తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. తాత్కాలిక మహిళ కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు నుంచి మంచిర్యాల వస్తున్న బస్సులో తాత్కాలిక డ్రైవర్‌ శ్రీనివాస్‌ విధులు నిర్వహిస్తున్నారు. బస్సులో మహిళా కండక్టర్‌ ఉండటంతో.. శ్రీనివాస్‌కు దుర్భుద్ది పుట్టింది. 
మహిళ కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నం

పథకం ప్రకారం బస్సులో ప్రయాణికులు ఎక్కకుండా చూసిన శ్రీనివాస్‌.. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో బస్సును ఆపి మహిళా కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. అయితే శ్రీనివాస్‌ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు జైపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో సంస్థ ఉన్నతాధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్‌లతో పలు సర్వీసులను నడుపుతున్న విష్యం తెలిసిందే.

No comments:
Write comments