పార్టీ లకు అతీతంగా పని చేస్తా..అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా

 

హుజూర్ నగర్ విజేత సైదిరెడ్డి
సూర్యాపేట అక్టోబర్ 25,  (globelmedianews.com)
సూర్యాపేట జిల్లా  హుజూర్ నగర్  నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి  శుక్వారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ని  అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సైదిరెడ్డి మాట్లాడుతూ  హుజూర్ నగర్ లో రికార్డ్ స్థాయి లో మెజార్టీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 
పార్టీ లకు అతీతంగా పని చేస్తా..అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా

అందరిని కలుపుకొని పోయి పార్టీలకు అతీతంగా పని చేస్తా అని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత నా గెలుపు తో తేటతెల్లం అయ్యిందని అన్నారు. నా గెలుపు ప్రభుత్వంకు మరింత బలం చేకూరిందని అన్నారు. ఎన్నికల కోడ్ అయిపోయింది. శనివారం సి.యం కేసీఆర్ హుజూర్ నగర్ వస్తున్నారని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో వరాల జల్లు కురిపిస్తారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరు అభివృద్ధి కోసం సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

No comments:
Write comments