పుష్పగిరి మఠంలో గురుసంక్రమణ పరిహారహోమం

 

శ్రీకాళహస్తి  అక్టోబరు 29 (globelmedianews.com)
వాయులింగేశ్వరుని చెంత పుష్పగిరిమఠంలో  గురుసంక్రమణ పరిహారహోమం ఘనంగా జరిగింది.  మంగళవారం గురుగ్రహం వృశ్చికరాశి నుండి ధనురాశికి సంక్రమణ జరుగు సంధర్బంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తిలోపుష్పగిరిమఠంలో  శ్రీజయనిధి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గురు సంక్రమణ పరిహర హోమం ఘనంగా నిర్వహించారు. 
పుష్పగిరి మఠంలో గురుసంక్రమణ పరిహారహోమం

ముందుగా దక్షిణామూర్తి,లక్ష్మిదేవి,కుబేర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గజపూలమాలల తో వివిధ అభరణాలతో సుందరంగా అలంకరించారు.అనంతరం  వేదపారాయణం గావించి గురుగ్రహమరియు శ్రీలక్ష్మీకుబేర కలశ స్థాపన గావించారు. అనంతరం గురుగ్రహ హోమం మరియు శ్రీలక్ష్మి కుబేరహోమం నిర్వహించి తదుపరి పూర్ణాహుతితో సమాప్తించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి విచ్చేసి హోమాది కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంకాలం భక్తుల దర్శనార్దం ఉత్సవ మూర్తులను పురవీధులలో ఉరేగించారు.

No comments:
Write comments