ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మావోయిస్టు నేత జగన్ లేఖ
హైదరాబాద్‌ అక్టోబర్ 7  (globelmedianews.com)
ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని లేఖలో పేర్కొన్నారు. 
ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని జగన్‌ సూచించారు. డిమాండ్ల సాధనకు కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. కార్మికులపై సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరైనదికాదని ఆయన మండిపడ్డారు.

No comments:
Write comments