యురేనియం పాపం జోగురామన్నదే.. సోయం బాపురావు

 

ఆదిలాబాదు అక్టోబర్ 29 (globelmedianews.com)
తెలంగాణ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం రూ.పది వేలు గుస్సాడిలకు ఇచ్చి ఆదివాసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ‘నేను పిలుపు ఇస్తే ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఉండదు. నాపై ఎమ్మెల్యే జోగు రామన్న ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే అట్రాసిటి కేసు పెడుతాను. యురేనియం పాపం జోగురామన్నదే.
యురేనియం పాపం జోగురామన్నదే.. సోయం బాపురావు

జోగురామన్నా.. జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉండు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగిస్తాను. రూ. 10వేలు ఇస్తే ఆదివాసీలు అమ్ముడు పోరు. గుస్సాడిల పదివేలు ఇచ్చుడు కాదు మహారాష్ట నుంచి వలసోచ్చిన లంబాడాలను తొలగించ చేతకావడం లేదు. సీఎం తెలంగాణ రాష్ట్రాన్ని దళారుల చేతుల్లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దించే వరకు ఆదివాసీల పోరాటం ఆపేది లేదు. నక్సలైట్ ప్రాంతాల నిధులతో టీఆర్ఎస్ నేతల పొలాలకు రోడ్లు వేసుకున్నారు’ అని బాపురావు సంచలన కామెంట్స్ చేశారు.

No comments:
Write comments