అప్పులు రెట్టింపవుతాయి

 

సూర్యాపేట అక్టోబరు 5, (globelmedianews.com)
హుజుర్ నగర్ లో తెరాస గెలిస్తే అప్పులు రెట్టింపు చేస్తాడు తప్ప కెసిఆర్ చేసేది ఏమి లేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని కేటీఆర్ ఓట్లు అడుగుతన్నాడ ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  శుక్రవారం కేటీఆర్  రోడ్డు షో పేలవంగా జరిగింది..ఆర్భాటాలు, అట్టహాసలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదు. 
అప్పులు రెట్టింపవుతాయి

కాంగ్రెస్ గెలుస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని అయన అన్నారు. కెసిఆర్ నియంతృత్వం వల్లనే ఆర్టీసీ ఉద్యోగులుసమ్మెకు వెళ్లారు. ఆర్టీసీ ని కెసిఆర్ కావాలనే నిర్వీర్యం చేసాడు. నష్టాలను బూచిగా చూపి ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తున్నాడని అన్నారు. తెలంగాణాలో ప్రశ్నించేగొంతు లేకుండాచేయాలనీ కెసిఆర్ చూస్తున్నాడు. ఏపీ లో చేసిన విధంగా ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని పొన్నం డిమాండ్ చేసారు.

No comments:
Write comments