కోలివుడ్ కు షిఫ్టైన శ్రీరెడ్డి

 

చెన్నై, అక్టోబరు 12, (globelmedianews.com)
టాలీవుడ్‌లో దున్నుడు అయిపోయింది.. పాప కోలీవుడ్‌‌కి ఫిష్ట్ అయ్యింది. ఇక్కడ ఎలాగూ ఆఫర్లు రాకుండా చేసుకుంది.. కనీసం అక్కడైనా ఏదో కష్టపడుతుంది అనుకుంటే ఫ్యాన్స్ మధ్య పెంట పెట్టే యవ్వారాలే మొదలుపెట్టింది. ఆ మధ్య లారెన్స్‌తో పాటు ఖుష్బూ భర్త సుందర్. సి, విశాల్ లాంటి పాపులర్ హీరోలు, దర్శకుల సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి టార్గెట్ ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ వైపుకి మళ్లింది.
కోలివుడ్ కు షిఫ్టైన శ్రీరెడ్డి

చిన్ని చిన్న హీరోలపై కామెంట్స్ చేస్తుంటే పెద్దగా కిక్ ఉండటం లేదబ్బా.. చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలనే టార్గెట్ చేయాలనుకుని అదే పనిలో ఉన్న శ్రీరెడ్డి తాజాగా తమిళ తలైవా రజినీకాంత్‌నే ప్రశ్నిస్తోంది.ఆయన పొలిటికల్ ఎంట్రీపై సీరియస్ కామెంట్స్ చేసింది.. ‘ఇదేమీ సినిమా కాదు రజినీకాంత్ గారూ.. సస్పెన్స్ మెయింటెన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారా? క్లారిటీ ఇవ్వండి’? అంటూ పోస్ట్ పెట్టింది. అంతటితో ఆగకుండా ‘రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. ఆయన పార్టీలో నేనూ జాయిన్ అవుతా’ అంటూ మరోపోస్ట్ పెట్టింది.అయితే ఆయన పార్టీ సంగతి నీకు ఎందుకులే కాని.. ‘నువ్ పార్టీ పెట్టొచ్చుగా ఆంధ్రప్రదేశ్‌‌లో నీకు సపోర్ట్ చేస్తాం’, ‘నువ్ పిలివలేదనే రజినీకాంత్ ఇంకా రాజకీయాల్లోకి రాలేదు.. ఇప్పుడు పిలిచావ్‌గా వచ్చేస్తారులే’ అంటూ ఆమె పొలిటికల్ ఎంట్రీపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు.

No comments:
Write comments