చిరంజీవితో జగన్ భేటీ వెనుక....

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. తనను కాలకేయుడంటూ తిట్టిన జూపూడి ప్రభాకర్ రావును దసరా పర్వదినాన స్వయంగాజెండా కప్పి మరీ ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి సీఎంను కలవబోతున్నారు. తన ప్రత్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవితోజగన్ భేటీ అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు పార్టీకి ఉపయోగపడేవే.జూపూడిని పార్టీలో చేర్చుకోవడానికి, చిరంజీవిఅడగ్గానే అపాయింట్‌మెంట్ ఇవ్వడం అనేవి జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులే. ఆంధ్రప్రదేశ్‌లో కాపులు, ఎస్సీల జనాభా ఎక్కువనే సంగతి తెలిసిందే. 
చిరంజీవితో జగన్ భేటీ వెనుక...

ఈ రెండు వర్గాలను పూర్తిగాతనవైపు తిప్పుకోవడం కోసమే జగన్ ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార వేడుకకు జగన్.. పవన్ కళ్యాణ్‌తోపాటు చిరంజీవిని కూడాఆహ్వానించారు. కానీ వారిద్దరూ వెళ్లలేదు.ప్రభాస్ నటించిన సాహో సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వని జగన్ సర్కారు.. చిరంజీవి నటించిన సైరాకు మాత్రంచివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో చిరంజీవి ఫ్యాన్స్‌ను జగన్ ఆకట్టుకున్నారు.ఇటీవల ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ కోసం చిరంజీవి తాడేపల్లి వెళ్లారు. ఈవిగ్రహావిష్కరణకు అవసరమైన అనుమతులను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే తెప్పించారు. కార్యక్రమంలోనూ ఆ పార్టీ నేతలే ఎక్కువగా కనిపించారు.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి, మళ్లీసినిమాల్లోకి వచ్చినప్పటికీ.. జనాల్లో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని రెండు వరుస హిట్లు నిరూపిస్తున్నాయి. దీంతో చిరంజీవితో సఖ్యతగా మెలగడం ద్వారా ఆయనఅభిమానులను ఆకట్టుకోవచ్చనేది జగన్ వ్యూహం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ బలహీన పడటానికి కూడా ఇది ఉపకరిస్తుంది.ఇవన్నీ చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న కాపులను పూర్తి స్థాయిలో తనవైపు తిప్పుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. అంతే కాదు.. తనపై పవన్ కళ్యాణ్, జనసేన దూకుడుగా ముందుకెళ్లకుండాఉండటానికి, తటస్థంగా ఉండే వారు కూడా.. ఓవైపు పవన్ తనను తిడుతున్నా జగన్ మాత్రం చిరంజీవితో ఎంత బాగుంటున్నాడోనని భావించేలా జగన్ వ్యూహాలు ఉంటున్నాయి. అంటే..తన పట్ల జనంలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో, చిరు ఫ్యాన్స్‌లో సానుకూల సంకేతాలు వెళ్లేలా జగన్ చర్యలున్నాయి.

No comments:
Write comments