బస్సు భీభత్సం…వాహనాలు ధ్వంసం

 

హైదరాబాద్ అక్టోబర్ 28(globelmedianews.com)
హైదరాబాద్  హబ్సీగూడ చౌరస్తా వద్ద ఒక ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలైన ఒక బస్సు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 
బస్సు భీభత్సం…వాహనాలు ధ్వంసం

జేబీఎస్ నుంచి జనగామ వెళ్తున్న ఈ ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడిపిస్తున్నాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, బస్సును డ్రైవర్ అక్కడే వదిలి వెళ్లడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

No comments:
Write comments