విశ్వహిందూ పరిషత్ శిక్షణ తరగతులు

 

కౌతాలం అక్టోబరు 12, (globelmedianews.com)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద లో విశ్వహిందు పరిషత్ జిల్లా కార్యదర్శి మారుతిమోహన్ గారి అద్వర్యం లో దక్షిణాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యకర్తలకు శిక్షణ తరగతులు 12 మరియు 13 వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా కేంద్ర సహా కార్యదర్శి సత్యంజీ దక్షిణాంధ్ర రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నందిరెడ్డి, సాయిరెడ్డి కార్య నిర్వాహక అధ్యక్షులు రామకృష్ణ రెడ్డీ హాజరయ్యారు. 
విశ్వహిందూ పరిషత్ శిక్షణ తరగతులు

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం 2019-20 కి గాను ఉరుకుంద క్షేత్రం లో నిర్వహిస్తున్నాం అని హిందుత్వం గురించి రాబోవు కాలం లో చేయవలసిన కార్యాచరణ గురించి హిందుత్వం గొప్పతనం గురించి ఈ శిక్షణ తరగుతాలలో తెలియజేస్తామనీ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు కర్నూల్, కడప చిత్తూరు, ప్రకాశం, మరియు నెల్లూరు జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చారు. అని అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు వ్యాసరాజు సహా కార్యదర్శి ప్రాణేష్ జిల్లా సహా కార్యదర్శి దేవేంద్ర భాజపా కిసాన్ మోర్చా అధ్యక్షులు రామకృష్ణ బాలకొండప్ప, ఆంజనేయులు ప్రచార ప్రముఖ్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments