రైతులను ఆదుకోవాలి

 

సిద్దిపేట అక్టోబర్ 28,  (globelmedianews.com)
అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మూసేస్తే... అప్పుల్లో ఉన్న రాష్ట్రం పరిస్థితేంటని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయన అధ్వర్యంలో సాగుతున్న గాంధీ సంకల్ప యాత్ర సోమవారం నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకుంది. ఎంపీ మాట్లాడుతూ ప్రైవేటు, కాంట్రాక్టు సంస్థలతో కేసీఆర్ కుటుంబం కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను బహిర్గతం చేసేలా రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలి. 
రైతులను ఆదుకోవాలి

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాల్లో పెట్టిన ఖర్చుతో సమానంగా...  ఒక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనే ఖర్చు పెట్టారని అన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని  ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను  రాష్ట్రంలో వర్తింప చేసి ఉంటే...  రైతులపై ఆర్థిక భారం తగ్గేది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే... ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలుకు నోచుకోవడంలేదని అయన విమర్శించారు.

No comments:
Write comments