వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ సీనియర్ల లొల్లి

 

వరంగల్, అక్టోబరు 12, (globelmedianews.com)
అసంతృప్తితో గరమైతున్న సీనియర్లు  ‘‘మేం జూనియర్లకు సలాం కొట్టాల్నా? సీనియర్లం అయి ఉండి, వాళ్ల కింద పని చేయాల్నా?’’ అంటూ గవర్నమెంట్ డాక్టర్లు ఫైర్ అయిపోతున్నరు. వైద్యారోగ్య శాఖలో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ, వారందరినీ పక్కన పెట్టిన సర్కారు వాళ్ల కంటే జూనియర్లను డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డీఎంఈ), పబ్లిక్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)గా నియమించింది. రూల్స్ ప్రకారం సీనియర్లకు దక్కాల్సిన ఈ పోస్టులను జూనియర్లకు కట్టబెట్టిన సర్కారు.. దీనిని సమర్థించుకునేందుకు ఓ టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపుతోందని డాక్టర్లు మండిపడుతున్నారు.తెలంగాణ వచ్చాక డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, ఉద్యోగుల విభజనలో డీఎంఈ, డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైద్య విధాన పరిషత్ కమిషనర్ పోస్టులు ఆంధ్ర రాష్ర్టానికి వెళ్లాయి. 
వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ సీనియర్ల లొల్లి

కొత్త పోస్టులను క్రియేట్ చేయని ప్రభుత్వం, ఇంచార్జ్ డీఎంఈ, ఇంచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్లతో జూనియర్లకు పోస్టింగులు ఇచ్చింది. దీంతో సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు తీర్పులు సీనియర్లకు అనుకూలంగా వచ్చాయి. అయినా ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు పోస్టులు క్రియేట్ చేయలేదని, వాళ్లు కేవలం ఇంచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేనంటూ సాంకేతిక అంశాలను సాకుగా చూపుతోంది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు విషయంలోనూ ఇలాగే జరిగింది. కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఒక డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించాల్సి ఉండగా, ప్రభుత్వం ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారికి ఈ పదవిని కట్టబెట్టింది. దీనిపై డాక్టర్లు కోర్టుకు వెళ్లినా, అసలు పోస్టే లేనప్పుడు నిబంధనలు ఎలా వర్తిస్తాయని చెప్పి ప్రభుత్వం కోర్టు తీర్పును పక్కనబెట్టింది.డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్ సీనియారిటీ జాబితాలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన డాక్టర్లే ముందు వరసలో ఉన్నారు. ప్రస్తుతం ఇంచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎంఈ, ఇంచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న వ్యక్తులు అగ్రకులాలకు చెందిన వాళ్లు కావడంతో పాటు సీనియారిటీ జాబితాలో వెనక ఉన్నారు. దీంతో ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని ఎస్సీ, ఎస్టీ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారం రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సైతం డాక్టర్లు ఫిర్యాదు చేశారు.మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నియామకాల్లోనూ సీనియర్లకు బదులు జూనియర్లకు ప్రయారిటీ ఇస్తుండడంతో వివాదాలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు సూర్యాపేట మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించారు. సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు ఉండగా, ఓ అసోసియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించడంపై డాక్టర్లు గుర్రుగా ఉన్నారు. బంధు ప్రీతి, కుల సమీకరణాలతో సదరు అసోసియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ పోస్టును కట్టబెట్టినట్టు ఓ సీనియర్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. హోదాలో, సర్వీసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తి కింద తాను పని చేయడం ఇబ్బందిగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అడిషనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి సకాలంలో డీపీసీ(డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ) వేయడం లేదని సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. అడిషనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల భర్తీ పూర్తయితే, సీనియర్ అడిషనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించాల్సి ఉంటుందని, అందుకే అడిషనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి డీపీసీ వేయడం లేదని సీనియర్లు చెబుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, అనుబంధ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లుగా అడిషనల్ డైరెక్టర్లకు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తారు. కానీ, అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా ఇంచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదాతోనే సరిపెడుతున్నారని సీనియర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు, పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలని వారు కోరుతున్నారు

No comments:
Write comments