మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ కు సుప్రీంకోర్టు జ‌ల‌క్

 

ముంబాయి అక్టోబర్ 1 (globelmedianews.com)
మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్‌కు సుప్రీంకోర్టు జ‌ల‌క్ ఇచ్చింది. దీంతో సీఎం ఫ‌డ్న‌వీస్ చిక్కుల్లో ప‌డ్డారు. త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో క్రిమిన‌ల్ కేసుల‌ గురించి వెల్ల‌డించ‌ని కేసులోవిచార‌ణ చేప‌ట్టాల్సిందే అని సుప్రీం పేర్కొన్న‌ది. సీజేఐ రంజ‌న్ గ‌గోయ్‌తో పాటు జ‌స్టిస్ దీప‌క్ గుప్తా, జ‌స్టిస్ అనిరుధ్ బోస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చినక్లీన్ చిట్‌ను సుప్రీం తిర‌స్క‌రించింది. 
మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ కు సుప్రీంకోర్టు జ‌ల‌క్

మ‌హారాష్ట్ర‌కు చెందిన స‌తీశ్ ఊకే .. సీఎం ఫ‌డ్న‌వీస్‌పై కేసు దాఖ‌లు చేశారు. ఫ‌డ్న‌వీస్‌పై ప‌లు క్రిమిన‌ల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటి గురించి ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొనలేద‌ని స‌తీశ్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసులను రిప్ర‌జెంటేష‌న్ ఆఫ్ పీపుల్ యాక్టులోని సెక్ష‌న్ 125 ప్ర‌కారం విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇవాళ సుప్రీంఆదేశించింది. కొత్త‌గా ఫిర్యాదును స్వీక‌రించాల‌ని ట్ర‌య‌ల్ కోర్టును కూడా ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీ సీఎం అభ్య‌ర్థిగామ‌రోసారి ఫ‌డ్నవీస్ పోటీ చేయ‌నున్నారు. అయితే సుప్రీం తీర్పుతో ఫ‌డ్న‌వీస్ భ‌విష్య‌త్తు ఆగ‌మ్యగోచ‌రంగా మారింది.

No comments:
Write comments