కేసరపల్లిలో ఐదో రోజుకు చేరుకున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన

 

గన్నవరం అక్టోబర్ 12 (globelmedianews.com)
కేసరపల్లి ఎన్టీఆర్ పశువైద్యకళాశాల  క్రీడా ప్రాంగణంలో గన్నవరం  నియోజకవర్గ  వైకాపా సమన్వయ కర్త యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్ధాయి ఒంగోలు జాతి వృషభరాజముల బలప్రదర్శన ఐదో రోజుకి చేరుకుంది. మూడో రోజు వర్షం కారణంగా మైదానం తడిసి ముద్దైంది. ఆ నీటిని తొలగించి  న్యూకేటగిరి విభాగంలో పోటీలు నిర్వహించారు. సుమారు 18 జతలు ఒంగోలు జాతి ఎడ్లు నువ్వానేనా అన్నట్లు  హోరాహోరీగా పోటిపడ్డాయి. 
కేసరపల్లిలో ఐదో రోజుకు చేరుకున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన

ప్రదర్శన తిలకించేందుకు రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ , కర్ణాటక , ఒరిస్సా నుంచి పశుపోషకులు రైతులు , మహిళలు , ఎన్టీఆర్ పశువైద్య కళాశాల  విద్యార్థులు ,  యువత చిన్నారులు   పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్యాలరీ లు నిండిపోయాయి. వీక్షకుల కేరింతల మధ్య ఉత్సాహం భరితంగా సాగాయి.  పదర్శనకు  వచ్చేవారికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యార్లగడ్డ వెంకట్రావు తానే దగ్గరండి స్వయంపర్యవేక్షిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరషానికి ప్రతికగా శరీర సౌష్టవంలో తనదైన ముద్రవేసుకున్న ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన నిర్వహించటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఒంగోలు జాతి ఎడ్ల  పశుపోషకులలో ధైర్యాన్ని నింపటంతో ఒంగోలు జాతిని పరిరక్షించాలనే  ముఖ్య   ఉద్దేశంతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు..

No comments:
Write comments