ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ను చేర్చి పేదవారికి ఉచిత చికిత్స: మంత్రి ఈటల

 

హైదరాబాద్‌ అక్టోబర్ 25   (globelmedianews.com):
ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ను చేర్చి పేదవారికి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్‌ అవగాహన వాక్‌ నిర్వహించారు. సంజీవయ్య పార్క్‌ నుంచి జలవిహార్‌ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 
ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ను చేర్చి పేదవారికి ఉచిత చికిత్స: మంత్రి ఈటల

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్సకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని, త్వరలో పెట్ స్కాన్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 11 టీచింగ్‌ ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ని గుర్తించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఈటల పేర్కొన్నారు.

No comments:
Write comments