పిచ్చి కుక్క స్వైర వివారం

 

నాలుగేళ్ల ఏళ్ల పాపకు తీవ్ర గాయాలు
15 కుట్లు వేసిన డాక్టర్స్
హైదరాబాద్ అక్టోబరు 22, (globelmedianews.com)
కొత్తపేట మార్కెట్ వీధిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఒక నాలుగేళ్ల పాపను తీవ్రంగా గాయపర్చింది.వివరాల ప్రకారం మార్కెట్ వీధిలో నివాసం ఉంటున్న షేక్ మొహిద్దీన్ కుమార్తె అమీరూన్ (4 ) ఉదయం ఇంటి సమీపంలో తిరుగుతుండగా అకస్మాత్తుగా పిచ్చి కుక్క వచ్చి తీవ్రంగా గాయపరిచింది. హుటాహుటిన పాపను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుకి  తీసుకువచ్చారు.
పిచ్చి కుక్క స్వైర వివారం

పాపకు 15 కుట్లు  వేసినట్లు డా.కిరణ్ తెలిపారు, పాపకు ఎటువంటి ప్రాణాపాయం లేదని అయితే బాగా లోతుగా కుక్క గాట్లు పడ్డాయని డాక్టర్ చెప్పారు.కుక్కలతో ప్రజలు బెంబేలు..ఇటీవల కాలంలో కుక్కలు బెడద ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయా బ్రాంతులకు గురవుతున్నారు.మార్కెట్ ఏరియాలో అయితే చాలా ఎక్కువగా సంచరిస్తున్నాయి. పిల్లలను ఇంటి నుండి బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు చాలా భయాందోళనలు చెందుతున్నారు.ఈ రోజు 4 ఏళ్ల పాపను కుక్క తీవ్రంగా గాయ పర్చడంతో ఇంకా భయాందోళనలు ఎక్కువయ్యాయి. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:
Write comments