కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవకుమార్ ఇల్లు ముట్టడి చేసిన విద్యార్థి యువజన సంఘాలు

 

కర్నూలు అక్టోబర్ 30  (globelmedianews.com)
రాయలసీమ లో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రోజు రోజుకూ ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. బుధవారం నాడు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జాక్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంపీ  డా.  సంజీవకుమార్  ఇల్లు ముట్టడి చేశారు  రాయలసీమ లో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు అనంతరం విద్యార్థి,యువజన సంఘాల నేతల దగ్గరికి ఎంపీ  సంజీవకుమార్ వచ్చి వారి ఉద్యమానికి మద్దతు తెలిపారు విద్యార్థులు,యువజన సంఘాల నేతలు చేస్తున్న ఉద్యమము న్యాయమైంది అన్నారు తరతారలు రాయలసీమకు అన్యాయం చేశారని అన్నారు 
కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవకుమార్ ఇల్లు ముట్టడి చేసిన విద్యార్థి యువజన సంఘాలు

గత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని హైకోర్టు ఒకే చోట పెట్టి రాయలసీమ కు అన్యాయం చేశారని అన్నారు కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసమే నిర్మించారు అని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తారని అన్నారు రాయలసీమ లో రాజధాని కర్నూల్ లో హైకోర్టు సాధన కోసా0 జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెలసీలను   ఒకేతాటిపైకి తెచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తాము అని వారికి మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జాక్ నేతలు శ్రీరాములు,చంద్రప్ప,రామకృష్ణ,సీమకృష్ణ,శివ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments