ఆర్టీసీ సమ్మెకు సంఘీభావ ర్యాలీ

 

నారాయణపేట అక్టోబరు 10, (globelmedianews.com)
నారాయణ పేట్ జిల్లా  కోస్గి పట్టణ కేంద్రంలో ఆర్ టి సి కార్మికులకు మద్దత్తుగా అఖిల పక్షం ఆద్వర్యంలో సంఘీభావ ర్యాలీ ని  నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వినతి పత్రం అందజేసిన పిదప , ప్రధాన రహదారిపై ధర్నాకు  బైఠాయించారు. ఈ సంధర్బంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్ టి సి కార్మికుల పాత్ర ఎంతగానో ఉందని అన్నారు. 
ఆర్టీసీ సమ్మెకు సంఘీభావ ర్యాలీ

ఉద్యమ సమయం లో ఆర్ టి సి కార్మికులు తమ విధులను బహిష్కరించి , తమ జీవితాలను పణంగా పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్ టి సి కార్మికులకు న్యాయం చెయ్యాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులతో పాటు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

No comments:
Write comments