సమ్మెలో కమలం సీరియస్

 

నల్గొండ, అక్టోబరు 18, (globelmedianews.com)
రాష్ట్రంలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెలో బీజేపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. సమ్మెకు మద్దతిస్తూ కార్మికులకు అండగా నిలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు  తన మద్దతు కోరిన కాసేపటికే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లాల పార్టీ నాయకులతో సమావేశమై ఉద్యమ వ్యూహాన్ని రూపొందించారు. 
సమ్మెలో కమలం సీరియస్

తర్వాతి రోజు పొద్దున్నే బస్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించారు. దీంతో అప్పటివరకు ఆర్టీసీ కార్మికుల వరకే పరిమితమైన సమ్మె.. బీజేపీ రంగ ప్రవేశంతో తీవ్ర ఉద్యమ రూపం దాల్చింది.ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఫలితాల గందరగోళం, స్టూడెంట్ల ఆత్మహత్యలు, గ్లోబరీనా ఇష్యూలో ఆందోళనలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ సమస్య తలెత్తితే అక్కడ వాలిపోతున్నారు. బస్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌ ముట్టడిలో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. దీంతో వారిని నియంత్రించడానికి వందలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. 

No comments:
Write comments