గుత్తి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

 

అనంతపురం  అక్టోబరు 5, (globelmedianews.com)
జిల్లాలోని గుత్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబ్బార్ ట్రావెల్స్ బస్ను ఓ కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారు అత్యంత వేగంగా వెళ్తూ.. డివైడర్ను ఢీకొని రోడ్డుకు మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సును ఢీకొంది. 
గుత్తి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మృతి చెందిన వారిలో ముగ్గురు అనంతపురం జిల్లా రేణుమాకులపల్లికి చెందిన మోహన్ కృష్ణ, సోదనపల్లికి చెందిన అనీల్ కుమార్రెడ్డిగా, బెంగుళూరుకు చెందిన అబ్దుల్ ముజీబ్గా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందున ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

No comments:
Write comments