అయోమయంలో రాజధాని రైతులు

 

గుంటూరు, అక్టోబర్ 30, (globelmedianews.com)
ఇది ఆంధ్రుల ఖర్మ అనుకోవాలో ప్రారబ్దం అనుకోవాలో అన్నింటికీ మించి పాపం శాపం అనుకోవాలో తెలియదు కానీ ఆంధ్రులకు ఇప్పటికీ రాజధాని లేదు. చెప్పుకోవడానికి బాధగా ఉన్నా ఇది పచ్చి నిజం. అమరావతి ఏపీకి రాజధాని కదా ఎవరైనా అంటే వారు కోమాలో నుంచి ఇపుడే మెలకువ వచ్చి అడుగున్నట్లుగానే భావించాలి మరి. కాకపోతే మరేంటి 2015 అక్టోబర్ 22న చంద్రబాబు నాటి ముఖ్యమంత్రిగా ప్రధాని మోడీని తీసుకువచ్చి మరీ శంఖుస్థాపన చేయిందారు. అప్పటికి బాబు చేతిలో అధికారం ఇంకా మూడున్నరేళ్ల పైబడి ఉంది. పట్టుదలగా పనిచేస్తే ఈ పాటికి రాజధానికి ఓ రూపూ షేపూ వచ్చేవి అనే వాళ్ళే ఏపీలో ఎక్కువగా ఉన్నారు. ఎంతసేపూ ప్రపంచ రాజధాని అని ఊళ్ళూ, దేశాలు పట్టి తిరిగిన చంద్రబాబు చివరికి ఎన్నికలు దగ్గరపడేసరికి చేతులెత్తేశారు. 
అయోమయంలో రాజధాని రైతులు

మళ్ళీ ఒక్క చాన్స్ అని బతిమాలుకున్నా ఫలితం లేకపోయింది. కట్ చేస్తే ఇపుడు ఏపీకి జగన్ ముఖ్యమంత్రిగా వచ్చారు.జగన్ పాలన పరుగులు పెడుతుందో లేదో తెలియదు కానీ కాలం వేగంగా సాగుతోంది. అపుడే ఆరునెలల విలువైన సమయం గడచిపోయింది. జగన్ పొలిటికల్ అజెండా వేరు అని ఎంత అనుకున్నా ఏపీకి రాజధాని ముఖ్యం. దాన్ని దాటి ఆయన కూడా ముందుకు పోలేరన్నది అక్షర సత్యం. అమరావతి అలాగే ఉండాలా లేక సైజ్ తగ్గించాలా, లేక మరో చోటకు రాజధానిని మార్చాలా ఇవన్నీ వైసీపీ సర్కార్ ఇష్టం. కానీ ఏపీకి కచ్చితంగా ఓ రాజధాని ఉండాల్సిందే. ఇది ఏపీ ప్రజల సెంటిమెంట్. ముందు బంగారం లాంటి మద్రాస్ ని వదిలేసుకుని వచ్చిన ఆంధ్రులు, మన సాటి తెలుగువారే అని నమ్మి ఉమ్మడి ఏపీ అభివ్రుధ్ధిలో భాగం అయ్యారు వజ్రం లాంటి హైదరాబాద్ ఎదుగుదలలో ఆంధ్రుల వాటా కూడా ఉంది అయినా కూడా ప్రాంతీయ విభేదాల కారణంగా దాన్ని కూడా వదులుకుని వచ్చేశారు. నిజానికి బాబుని 2014 ఎన్నుకున్నది, 2019 లో ఓడించడానికి కూడా ప్రధాన కారణం రాజధాని మాత్రమే. అది జగన్ వల్ల అవుతుందనే ఓటేసి బంపర్ మెజారిటీ ఇచ్చారు.జగన్ రాజధాని విషయంలో కమిటీలు, నివేదికలు అంటూ పొద్దు పుచ్చుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇంతటి భారీ మెజారిటీతో గెలిచిన తరువాత అయినా జగన్ దాగుడు మూతలు మాని తన మనసులో మాటను ధైర్యంగా జనంతో పంచుకోవాలి. అమరావతి రాజధాని వద్దు అనుకుంటే దానికి సహేతుకమైన కారణాలు చెప్పి మరో చోట కొత్త రాజధాని పనులు మొదలెట్టాలి. లేకపోతే ఉన్నచోటే భారీ నిర్మాణాలు, గ్రాఫిక్స్ అవసరం లేదనుకుంటే వాటిని ఆపేసి మిగిలిన వాటిలో వెంటనే మొదలుపెట్టాలి. నవంబర్ పూర్తి అయితే జగన్ పాలనకు ఆరు నెలలు నిండుతాయి. ఇప్పటి నుంచి రాజధాని విషయంలో వేగం పుంజుకుంటే తప్ప 2024 ఎన్నికల నాటికి జగన్ ఓ మాదిరి నిర్మాణమైనా పూర్తి చేయలేరు. ఏదీ పూర్తి చేయకుండా జనంలోకి వెళ్ళి బాబు మాదిరిగా జగన్ మరో చాన్స్ అని అడిగితే జనం ఎలా రియాక్ట్ అవుతారో కూడా వూహించడం కష్టం. ముఖ్యంగా రాజధాని ఆంధ్రుల సెంటిమెంట్. దాన్ని గౌరవించి జగన్ తక్షణం యాక్షన్ ప్లాన్ లోకి వెళ్ళడమే బెటర్ అని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. ఈలోగా మంత్రులు బొత్స సత్యనారాయణ వంటి వారు ఈ సున్నితమైన విషయంలో ఏమీ మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాజధానిని జగన్ కట్టలేడు అని అపుడే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టేశారు. దాన్ని కౌంటర్ చేయాలన్నా కూడా జగన్ ఆ దిశ‌గా పరుగులు పెట్టాల్సిన తరుణమిదే.

No comments:
Write comments