మొగిలిగిద్ద గ్రామంలో సంపూర్ణ మద్యనిషేదం

 

 గ్రామస్తుల తీర్మానం
 బెల్టు షాపులను అరికట్టాలని పోలీసులకు వినతి
రంగారెడ్డి అక్టోబర్ 02  (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక  నుండి గ్రామంలో మద్యం విక్రయాలు చేయరాదు అంటూ ముక్తకంఠంతో నినదించారు. గతంలో గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేయలని గ్రామ పంచాయతీ సర్పంచ్ సిరిగిద్ద లలిత, ఎంపిటిసి శ్రీశైలం తదితరుల ఆధ్వర్యంలో పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. 
మొగిలిగిద్ద గ్రామంలో సంపూర్ణ మద్యనిషేదం

ఈ సందర్భంగా గ్రామంలో మద్యం విక్రయాలు చేయరాదని మద్యం బెల్టు షాపుల ద్వారా అమ్మేవారు అక్టోబర్ ఒకటవ తేదీలోగా తమ దుకాణాలు ఎత్తివేయాలని ఆదేశించారు. అదేవిధంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సంపూర్ణ మద్యపాన నిషేధంతో గ్రామంలో ప్రజలు కలిసిమెలిసి సుఖంగా జీవించాలని ఆ విధంగా తీర్మానం ఆమోదించారు. ఈ మేరకు ఈ తీర్మానానికి చట్టబద్ధత కోసం ఎవరు మద్యం విక్రయాలు చేయరాదంటూ షాద్ నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ ఏ. శ్రీధర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాలని శ్రీధర్ కుమార్ ను గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా అలాంటి వారిపై దృష్టి సారించి అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు శ్రీధర్ కుమార్ హామీ ఇచ్చినట్టు ఎంపిటిసి శ్రీశైలం తెలిపారు.

No comments:
Write comments