రైతులకు 15 లక్షల గంధం చెట్లు

 

వరంగల్, నవంబర్ 2, (globelmedianews.com)
వచ్చే హరితహారంలో రైతులకు గంధపు చెట్లు పెంచేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని, 15 లక్షల గంధపు మొక్కలను సిద్ధం చేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.  అటవీశాఖ నిర్ధేశించుకున్న 14 ప్రాధాన్యతా అంశాలపై జిల్లావారీగా ఉన్నతాధికారులు సమీక్షించారు. హరితహారం పురోగతి, వచ్చే ఏడాది కోసం నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధుల అనుసంధానం, ప్రధాన రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్, సహజ అడవుల పెంపకానికి అటవీ చెట్ల విత్తనాల సేకరణ, స్కూలు పిల్లలకు అటవీ ప్రాధాన్యత తెలిపేలా యాత్రలు, అటవీ నేరాలపై కఠిన చర్యలతో కేసులు, ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధి, వేసవిలో వన్యప్రాణుల కోసం నీటి వసతి ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. వీటితో పాటు ఉద్యాన వన శాఖతో సమన్వయం ద్వారా గంధం, వెదురు పెంపకానికి ప్రోత్సాహకాలు, ఆగ్రో ఫారెస్ట్రీ కింద మైక్రో ఇరిగేషన్ సదుపాయం కల్పించడం వంటివాటిపై చర్చించారు. 
రైతులకు 15 లక్షల గంధం చెట్లు

రైతులు పెంచిన గంధపు చెట్లు నరికేందుకు, అమ్ముకునేందుకు నిబంధనలు సులభతరం చేయాలని నిర్ణయించారు. అటవీ ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కడపడితే అక్కడ వంటలు చేయకుండా అటవీ ప్రాంతాలు, అర్బన్ పార్కుల్లో నిర్ధేశించిన ప్రాంతాల్లో వన భోజనాలకు వీలుగా పిక్నిక్ షెడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూములు ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూముల్లో అటవీ పెంపకం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సహజ సిద్దమైన అడవుల పెంపకం కోసం, తెలంగాణ ప్రాంతానికి అనువైన చెట్ల జాతుల నుంచి విత్తనాలు సేకరణ, విరివిగా అడవుల్లో నాటాలని నిర్ణయించారు. ప్రతీ అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా గడ్డి క్షేత్రాల అభివృద్ధి ద్వారా వన్య మృగాల సంచారం, ఆవాసం పెరిగేలా చర్యలు తీసుకోనున్నారు. అటవీ సంబంధిత నేరాలపై కఠినంగా వ్యవహరించడం, అరెస్టుతో పాటు చార్జిషీట్ ఫైల్ అయ్యి నిందితులకు శిక్షపడేదాకా నిరంతరం పర్యవేక్షించ నున్నారు. జిల్లాలవారీగా నర్సరీల పెంపు, ఉపాధి హామీ నిధులతో అనుసంధానంపై చర్చించారు. స్కూల్ పిల్లల్లో పర్యావరణ అవగాహన పెంచేందుకు సమీప అడవులు, అర్బన్‌పార్కుల సందర్శన, వన విహార యాత్రలకు ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాట్లు చేయనుంది. అటవీ ప్రాంతాల రక్షణకు, ఆక్రమణల నిరోధానికి పకడ్బంధీగా చర్యలు, రెవెన్యూ అధికారులతో సమన్వయం ద్వారా కందకాలు, కంచెల ఏర్పాటు, ఆక్రమణలకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనున్నారు.

No comments:
Write comments