ఈ నెల 6, 7, 8 తేదీలలో చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు పర్యటన

 

తొలిరోజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
14 నియోజవర్గాలపై సమీక్ష
విజయవాడ నవంబర్ 02 (globelmedianews.com)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 6, 7, 8 తేదీలలో జిల్లా పర్యటనకు రానున్నారు. చంద్రగిరి మండలంలోని మామండూరు వద్ద శ్రీదేవి గార్డెన్స్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సభా ప్రాంగణానికి పూజ చేసి ఏర్పాట్లు ప్రారంభించారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 6న ఉదయం 8 గంటలకు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 
ఈ నెల 6, 7, 8 తేదీలలో చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు పర్యటన

అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో మామండూరుకు చేరుకుని టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నాలుగు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం జరుగుతుంది. 7, 8 తేదీలలో మిగిలిన 10 నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ మూడు రోజులలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, కుట్రలతో ఇబ్బందులు పడుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శిస్తారు. ప్రజావ్యతిరేక విధానాలపై కూడా పోరాటాల దిశగా దిశానిర్దేశం చేస్తారు.

No comments:
Write comments