వైసీపీ కార్యకర్తలకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: సోమిరెడ్డి

 

నెల్లూరు నవంబర్ 29 (globelmedianews.com):
రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు తప్ప ఎవరికీ రక్షణ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనకు ప్రభుత్వం భద్రత కల్పించలేదని విమర్శించారు. దాడులు చేస్తామని వైసీపీ ప్రకటించినా అదుపు చేయలేకపోయారన్నారు.
వైసీపీ కార్యకర్తలకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: సోమిరెడ్డి

రాళ్లు, లాఠీలు, చెప్పులతో చంద్రబాబు కాన్వాయ్పై దాడి చేస్తే.. నష్టపోయిన వారు చేశారని.. వారికి ఆ హక్కు ఉందని డీజీపీ అనడం దారుణమని సోమిరెడ్డి పేర్కొన్నారు. అమరావతి రైతులు, రియల్టర్లు నష్టపోవడానికి కారణమెవరని ప్రశ్నించారు. చంద్రబాబు రాజధానిని అభివృద్ధి చేసి ఆస్తుల విలువ పెంచారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ఆస్తుల విలువ పడిపోయిందని సోమిరెడ్డి తెలిపారు.

No comments:
Write comments