బీజేపీ భేటీ

 

విజయవాడ  నవంబర్ 1, (globelmeidanews.com)
భారతీయ జనతా పార్టీ  జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు  జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా నవంబర్ 10న  ఆంధ్రప్రదేశ్  పర్యటనకు వస్తున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల పై   సన్నాహక సమావేశం శుక్రవారం  విజయవాడలో సీకే  గ్రాండ్ హోటల్ లో జరిగింది. 
బీజేపీ భేటీ

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇతర నేతలు హజరయ్యారు. కన్నా మాట్లాడుతే "రాష్ట్ర స్థాయి బూత్ కార్యకర్తల మహా సమ్మేళనం" కార్యక్రమంలో విజయవాడలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి,  బీజేపీ ని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం చెప్పట్టాం. ప్రస్తుతం రాష్ట్రంలో 25,000 పోలింగ్ బూత్ లకు బీజేపీ కమిటీలు ఏర్పాటు చేసామని అన్నారు.

No comments:
Write comments