రోడ్డు ప్రమాదంలో నటుడు రాజశేఖర్ కు స్వల్ప గాయాలు

 

రంగారెడ్డి నవంబర్ 13  (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లా  శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు పై అర్ధరాత్రి హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైయింది. ఘటనలో హీరో రాజశేఖర్ తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం.  విజయవాడ నుండి హైదరాబాద్   కారులో వస్తుండగా పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు టైర్ పగిలింది. దాంతో అదుపు తప్పిన కారు  డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. కారు పూర్తిగా ధ్వంసమయింది.  కారు  ఎయిర్ బెలూన్స్ తీర్చుకోవడం తో ప్రాణాపాయం తప్పింది.
రోడ్డు ప్రమాదంలో నటుడు రాజశేఖర్ కు స్వల్ప గాయాలు

అర్ధరాత్రి అతివేగంగా అజాగ్రత్తగా కారు నడిపిన సినీ హీరో రాజశేఖర్ పై  279,336 సెక్షన్ ల పై కేసు నమోదు చేస్తామని శంషాబాద్ రూరల్ సీఐ వెంకటేష్ తెలిపారు.  అర్ధరాత్రి రెండు గంటలకు ఘటన విషయం తెలియగానే పెద్ద గోల్కొండ కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అంతోనే రాజశేఖర్, అతని  మిత్రుడు మరో కారులో హైదరాబాద్ వెళ్ళారని పోలీసులకు తెలిసింది. పోలీసులు  ఘటనా స్థలంలోని  కారును స్వాధీనం చేసుకున్నారు.  రాజశేఖర్ భార్య జీవిత కు పోలీసులు ఫోను చేసారు. రాజశేఖర్ కు  స్వల్ప గాయాలు తగిలాయి.  ఇంటి వద్దనే డాక్టర్ ద్వారా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఆమె చెప్పారు.

No comments:
Write comments