బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

 

టీఆరెస్ పట్టణాద్యక్షుడు నాయిని నర్సయ్య
-దీక్ష దివాస్ ను పురస్కరించుకుని కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
వరంగల్ రూరల్ నవంబర్ 29, (globelmedianews.com)
కార్య దీక్షకుడు కేసిర్ తెలంగాణ రాష్ట్ర కోసం అమర నిరాహార దీక్షకు పూనుకోగా నాడు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని టీఆరెస్ పట్టణాద్యక్షుడు నాయిని నర్సయ్య అన్నారు. శుక్రవారం 'దీక్షా దివస్' ను పురస్కరించుకుని టిఆర్ఎస్ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం  వద్ద కేసీఆర్ చిత్ర పటానికి పాలాబిషేకం నిర్వహించారు. 
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

ఈ సందర్భంగా నాయిని నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం చావు అంచులోకి వెళ్లి స్వ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ దీక్ష ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని, ప్రతీ ఏట నవంబర్ 29 న కేసిఆర్ దీక్ష దివస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఆశయ సాధన బంగారు తెలంగాణలో అందరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించి కార్మికులంతా నా బిడ్డలని, ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకున్న కేసీఆర్ కార్మిక పక్షపాతిగా కార్మికుల గుండెల్లో దేవుడయ్యారని పేర్కొన్న నాయిని కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షలు నాయిని నరసయ్య, నామాల సత్యనారాయణ, ఎంపీపి మోతే కలమ్మ, టీఆరెస్కేవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మచ్చిక నర్సయ్య, దార్ల రమాదేవి, ఈర్ల నరసింహారావు, సదానందం, కుమారస్వామి, మాజీ కౌన్సిలర్లు మండల శ్రీనివాస్, బండి ప్రవీణ్, నాయకులు మచ్చిక రాజు, కిషన్ సదానందం, గుర్రాల రాఘవరెడ్డి, పెండెం రాజేశ్వరి, పెరమండ్ల స్వామి, ఎండీ పాషా, జగన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments