వైరాలో శాంతి ర్యాలీ

 

ఖమ్మం నవంబర్ 30 (globelmedianews.com)
షాద్ నగర్ లో జరిగిన ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో  ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైరా పట్టణంలో ర్యాలీ నిర్వహించి వైరా బస్టాండ్ నందు మానవహారం నిర్వహించారు.
వైరాలో శాంతి ర్యాలీ

ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ  ప్రియాంక రెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు మహిళలపై దాడులను నిలిపివేయాలని దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

No comments:
Write comments