కురుమూర్తి జాతర ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైన తెరాస ప్రభుత్వం

 

మహబూబ్ నగర్ నవంబర్ 4, (globelmedianews.com)
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి జాతర ఏర్పాట్లలో తెరాస ప్రభుతవ్ం పూర్తిగా విఫలమైందని దేవరకద్ర కాంగ్రెస్ నేత మధుసూధన్ రెడ్డి ఆరోపించారు.  ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దదైన కురుమూర్తి స్వామి జాతర కనీస వసతుల ఏర్పాట్లను గాలికొదిలిన ప్రభుత్వం.జాతర లో కీలకమైన మొదటి రోజు ఉద్దాల ఉత్సవం లో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు  తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారని అయన అన్నారు. 
కురుమూర్తి జాతర ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైన తెరాస ప్రభుత్వం

కీలకమైన జాతర ఉత్సవాలలో దేవాలయానికి కమిటీ లేకపోవడం, స్థానిక శాసనసభ్యుడు  పాటించుకోకపోవడం తో ఎక్కిడి సమస్యలు అక్కడ తిష్ట వేశాయి. కనీసం జాతర మైదానం కూడా చదను చేయకపోవడం,సరైన పారిశుద్ధ్య ఏర్పాట్లు లేకపోవడం, పందుల స్వైరవిహారం, రహదారులకు ఇరువైపులా కంప చెట్లు తొలగించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురు కుంటున్నారని అయన అన్నారు.  ఉమ్మడి జిల్లా నియోజకవర్గం లో కీలకమైన కురుమూర్తి స్వామి జాతర ను పట్టించుకోకుండా స్థానిక శాసనసభ సభ్యుడు  విదేశాల్లో తిరగడం  శోచనీయం. ఇకనైనా ప్రభుత్వం జాతర లో సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసారు.  

No comments:
Write comments