మరో సాంగ్ తో దుమ్ము రేపుతున్న సన్నీ లియోన్

 

ముంబై, నవంబర్ 29, (globelmedianews.com)
హల్లో జీ’ అంటూ ఫ్యా్న్స్‌కు నిద్రలేకుండా చేయడానికి వచ్చేసింది బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోనీ. సన్నీ ప్రధాన పాత్రలో ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్ 2’ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‌లో ‘హల్లో జీ’ అనే ఐటెం సాంగ్‌లో సన్నీ మెరిసింది. ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఈ పాటను పాడారు. ఈ పాట వీడియోను తాజాగా విడుదల చేశారు. ఏఎల్‌టీ బాలాజీ సంస్థ బ్యానర్‌పై ఏక్తా కపూర్ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ పాట విషయానికొస్తే.. అదిరిపోయే డ్రెస్సుల్లో సన్నీ స్టెప్పులతో అదరగొట్టింది.హల్లో జీ’ అంటూ సాగుతున్న ఈ పాటలో సన్నీ తన దుస్తులతో, స్టెప్పులతో సెగలు పుట్టిస్తోంది. 
మరో సాంగ్ తో దుమ్ము రేపుతున్న సన్నీ లియోన్

ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరు సన్నీ. సన్నీ చేసే ఐటెం సాంగ్స్‌కు మార్కెట్‌లో ఉండే డిమాండే వేరు. పాట విడుదలైన నిమిషంలోనే 26వేల మందికి పైగా దీనిని వీక్షించారు. ఇలాంటి సాంగ్స్‌తోనే సన్నీ బాలీవుడ్‌లో పాపులర్ అయింది. ఇక ఫ్యాన్స్‌కి ఈ పాటను చూడగానే నిద్రపట్టదేమో.బాలీవుడ్‌లో కేవలం ఐటెం సాంగ్స్‌ చేసేవారు ముగ్గురే ఉన్నారు. . వారిలో మలైకా అరోరా ఖాన్, నోరా ఫతేహి, సన్నీ లియోన్. ‘ఛయ్య ఛయ్య’ పాటతో మలైకా ఎప్పుడో తనని తాను ప్రూవ్ చేసేసుకున్నారు. నోరా ఫతేహీ కూడా గట్టి పోటీనిస్తున్నారు. కానీ సన్నీ లియోన్‌కు మాత్రం ఆమెకు ఆమే పోటీ అని నిరూపించారు. ఇప్పటివరకు సన్నీ చేసిన ఐటెం సాంగ్స్‌ అన్నీ ఇంటర్నెట్‌ను ఒక ఊపు ఊపేశాయి. అందుకే కాస్త ఖర్చు ఎక్కువైనా సన్నీ డేట్ల కోసం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎదురుచూస్తుంటారు.సన్నీ లియోన్ కెరీర్‌లో ‘రాగిని ఎంఎంఎస్’ సిరీస్ ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్ 2’ రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇందులో సన్నీ దెయ్యం పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈసారి సిరీస్‌ మరింత సెక్సీ థ్రిల్స్‌తో ఉంటుందని సన్నీ తెలిపారు. రాగిని ష్రాఫ్ అనే 20 ఏళ్ల యువతి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ట్రిప్‌కి వెళ్తుంది. ఈ ట్రిప్‌లో భాగంగా జరిగే కొన్ని సంఘటనలు రాగిని జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి. ఆ సంఘటనలు ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. జీ5, ఏఎల్‌టీ బాలాజీ యాప్స్‌లో డిసెంబర్ 18 నుంచి ఈ సిరీస్ ప్రసారం అవుతుంది.

No comments:
Write comments