పార్కుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

 

జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి నవంబర్ 29, (globelmedianews.com)
వనపర్తి మున్సిపాలిటీ లో చేపట్టిన పార్కుల అభివృద్ధి పనులను త్వరితగతిన  పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు వనపర్తి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్వేతా మహంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.         
పార్కుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

శుక్రవారం ఆమె పట్టణంలో చేపట్టిన పలు పార్కులను, కూరగాయల మార్కెట్ ను సందర్శించి పనుల పురోగతిని తనిఖీ చేశారు. డిసెంబర్ నెలలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో త్వరిత గతిన పార్కు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆమె కందకం వద్ద చేపట్టిన కూరగాయల మార్కెట్ షెడ్డు ను తనిఖీ చేశారు.

No comments:
Write comments