రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: చంద్రబాబు

 

విజయవాడ నవంబర్ 04  (globelmedianews.com)
 రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని విపక్ష నేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ఐక్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. హత్యా, రౌడీ రాజకీయాలు మానుకోవాలని వైసీపీని హెచ్చరించారు. 
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: చంద్రబాబు

తమ పార్టీకి చెందిన క్రియాశీలక కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు చేయడంతో సమావేశాలకే రావడం లేదన్నారు. కోడెలపై ఫర్నీచర్ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేయకపోవడంతో వారు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు అండగా నిలవాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

No comments:
Write comments