పరాయి మహిళతో ఎస్సై సరసాలు..రెండోసారి దొరికిపోయని వైనం

 

రంగారెడ్డి నవంబర్ 8, (globelmedianews.com)
గతంలో మహేశ్వరం పీఎస్ పరిధిలో పనిచేస్తూ ర్ల కేసులో సస్పెండ్ అయిన ఎస్సై  నర్సింహాపై  మరోసారి పిర్యాదు నమోదయింది.  నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్ లో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని గురువారం ఆమె ఇంట్లో ఉంటున్నాడు.  పక్కా సమాచారంతో ఎస్సై నర్సింహా భార్య, బంధువులతో ఆ మహిళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టారు. భార్యను, బంధువులను గమనించిన ఎస్సై నర్సింహ పరారయ్యాడు.  
పరాయి మహిళతో ఎస్సై సరసాలు..రెండోసారి దొరికిపోయని వైనం

చుట్టు పక్కల ఎంత వెతికినా దొరకక పోవడంతో ఎస్సై భార్య,  బంధువులు ఆ మహిళను నిలదీయగా తనకు భావ అవుతాడు అని బుకాయిస్తూ ఉంది. అదే సమయంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళ ఇంటికి రావడంతో జరిగిన విషయం తెలుకుకొని పోలీసులు ఎస్సై నర్సింహా వదిలి వెళ్ళిన డ్రెస్, ఫ్యాషన్ వాహనంను స్వాధీనం చేసుకున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ కు ఆ మహిళను తరలించారు. ఎస్సై నర్సింహా నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తూ ఉండడంతో అక్కడే పిర్యాదు చేయమని నాచారం పోలీసులు చెప్పడంతో ఎస్సై భార్య,బంధువులు అక్కడికి వెళ్లిపోయారు..

No comments:
Write comments