మద్యం దుకాణాలు వద్దు

 

ఖమ్మం నవంబర్ 02 (globelmedianews.com)
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసి ప్రారంభించిన సమ్మక్క వైన్ షాపు వద్ద మహిళలు అందోలనకు దిగారు.  పెద్ద ఎత్తున మహిళలు చెరుకొని టెంట్ కూల్చి వైన్ షాపు ప్రారంభం కాకుండా అడ్డుకున్నారు.  మా ఊరి లో వైన్ షాపు వద్దంటే వద్దు అని గ్రామస్తులు ఆందోళన చెపట్టారు. గత రెండు రోజుల నుండి ఆందోళన చెపట్టిన అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదని,గతంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉండేది..ఇక్కడ నుండి మంచీనీళ్ళు తీసుకొని వెళ్ళే వాళ్ళం అని,ఇప్పుడు ఎదో వైన్ షాపు వచ్చింది 
మద్యం దుకాణాలు వద్దు

అని వాటర్ ప్లాంట్ తీసేసి వైన్ షాపు ప్రారంబించారు. త్రాగే మంచి నీళ్ళ ప్లాంట్ తీసి ప్రాణాలు తీసిసే వైన్ షాపు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వీ.ఎం.బంబర్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు సంఘటణ స్థలానికి వచ్చి గ్రామస్తులకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. రెండు రోజుల్లో షాపు మార్పిస్తాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. వైన్ షాపు పూర్తిగా తీసే వరకు ఇక్కడ నుండి కదలం అంటూ మహిళలు, గ్రామస్తులు వైన్ షాపు ముందు  గెట్లు వేసి బైఠాయించారు.మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదలం అంటూ బీష్మించుకొని కుర్చున్నారు.

No comments:
Write comments