అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ సజీవ దహనం

 

రంగారెడ్డి నవంబర్ 04  (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే సోమవారం  చోటుచేసుకోవడం గమనార్హం. తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు ఈ ఘటనకు పాల్పడిన అనంతరం తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సిబ్బందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ సజీవ దహనం

దుండగుడు ప్రస్తుతం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. కాగా.. ఈ ఘటన భోజన విరామ సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనం తక్కువగా ఉన్న టైమ్లో ఆఫీసులోకి చొరబడిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. అయితే నిందితుడు సురేష్  ఒక రైతు. గౌరెల్లి గ్రామవాసి. అతడి పొలం రిజిస్త్రేషన్ కు విజయారెడ్డి లంచం అడిగినట్లు సమాచారం. తనను చాలకాలం వేధించినట్లు రైతు చెబుతున్నట్లు సమాచారం.  విజయారెడ్డి స్వగ్రామం శాలిగౌరారం మండలం పెరకకొండారం తహశీల్దార్ హత్య ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై దర్యాప్తు జరపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు మంద్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  విజయ హత్యపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

No comments:
Write comments