లాంగ్ మార్చ్ లో భవన నిర్మాణ కార్మికులు లేరు

 

తాడేపల్లి నవంబర్ 04 , (globelmedianews.com)
నదులు పొంగిప్రవహిస్తున్నాయని పదే పదే చెప్పాం. అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం అని తెలియచేశాం. వరదలు తగ్గాక ఇసుకతీయడం సాధ్యం కాదని చెప్పాం. మూర్ఘుల మనస్సులను రంజింపచేయలేమని వైకాపా పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి,సత్తెనపల్లి శాసనసభ్యుడు  అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేశారు. అందులో భవననిర్మాణకార్మికులు కనిపించలేదు. అందులో జనసేన జెండాలుపట్టుకున్న టిడిపి కార్యకర్తలు కనిపించారు. ఆ రెండు కిలోమీటర్లు కూడా నడవలేక కారు ఎక్కారు.అది టివిలలో చూశాం. పవన్ కల్యాణ్ మీ రాజకీయాలు మీరు నడుపుకుంటే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. 
లాంగ్ మార్చ్ లో భవన నిర్మాణ కార్మికులు లేరు

డిఎన్ ఏ అంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు.డిఎన్ ఏ అంటే చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల వ్యక్తిగతమైనది కాదు. మళ్లీ చెబుతున్నాను టిడిపి,జనసేన డిఎన్ ఏ ఒక్కటే.నిన్న మీరు తాటతీస్తామన్నారు.మీరు రెండు చోట్ల నిలబడితే ప్రజలు తాటతీశారు.మీరు మూలన కూర్చోబెట్టారన్నారే.కాదు మూలనకాదు...కూర్చోబెట్టారు...వంగోబెట్టారని ఎద్దేవా చేసారు. తాటతీయడం అంటే ఆరునెలలకు ఒకసారి గడ్డం తీయడం కాదు.రాజకీయంగా తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టే కాదు ఎవరూ సిద్దంగా లేరు. మీ నోరు పెద్దది మీ నోరు కన్నా వేయిరెట్లు పెద్దది మా నోరు గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తానంటే ప్రజలే మిమ్మల్ని తాటతీస్తారు.తాటిచాపచేస్తారు.దయచేసి మీరు మరిచిపోవద్దు.  రాజకీయాలలో విమర్శలు చేయండి అవి సద్విమర్శలు చేయాలిగాని వ్యక్తిగతంగా ఉండకూడదు. మా వ్యవసాయమంత్రి కన్నబాబు ని ఏం మాట్లాడుతున్నారు. మీరు కాకినాడ వెళ్లి కన్నబాబును ఓడించండి అని మీరు కోరితే తుక్కుతుక్కుగా మిమ్మల్ని ఓడించారు. కన్నబాబును గెలిపించారు. కన్నబాబు మీ పార్టీలో ఉండిఉండవచ్చు.మీ అన్నగారి పార్టీలో టిక్కెట్టు ఇచ్చిఉండవచ్చు.అందులో 18 మంది గెలిస్తే వారిలో కన్నబాబు ఒకరు. కన్నబాబుపై మీకు హక్కు లేదు.ఈ రాష్ర్టానికి మంత్రిగా ఉన్న కన్నబాబును ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తారా.కన్నబాబు కధ అంతా తెలుసంటారా ఏం తెలుసు మీకని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి  గురించి మీరు మాట్లాడారు.రెండున్నరేళ్లు జైలులో ఉన్నారని , వారికి మిమ్మల్ని విమర్శించే హక్కు లేదని,జగన్  కూడాప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారనిఇవన్నీ మీ మాటలు కాదు.అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడు స్ర్కిప్ట్ తీసుకువస్తే చదివే దౌర్భాగ్యపరిస్ధితి అని విమర్శించారు. ఇంతకుముందు టిడిపి వాళ్లు కూడా అన్నారు.వారందరికి తెలియచేస్తున్నా. జగన్  కేవలం నేరారోపణ చేయబడ్డ వ్యక్తి. 16 నెలలు జైలులో ఉన్నవ్యక్తి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్న వ్యక్తి. ఇవన్నీ తెలిసే ప్రజలు ఎన్నికలలో 151 సీట్లలో గెలిపించారు. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి  గురించి అవాకులు చెవాకులు పేలడం మంచిది కాదు. రాజకీయంగా వందవిమర్శలు చేయండి వాటికి సమాధానం చెబుతాం. చంద్రబాబు సత్తా అయిపోయింది.రాజకీయంగా దాడులు చేయడానికి చేస్తున్నారు అయినా స్పందన రావడం లేదు. ఆ మద్య లోకేష్ తో దీక్ష చేయించారు.దానికి సైతం స్పందన లేదు.దాంతో లాంగ్ మార్చ్ పెట్టారు. చంద్రబాబు ఎజెండాను మోయడం కోసం మీరు రాజకీయం నడుపుతున్నారు. మీ అభిమానులు కూడా జగన్  ఎందుకు ఓట్లు వేశారంటే మీకు ఓట్లు వేస్తే సైకిల్ కు ఓటు వేసినట్లేనని భావించి మాకు వేశారు. చంద్రబాబు ,పవన్ కల్యాణ్ భుజంపై తుపాకి పెట్టి మమ్మల్ని కాల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ , రాజకీయాలలో మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లండి. మాకు సిధ్దాంతం ఉంది మాకు నైజం ఉందంటున్నారు.ఏంటి మీ సిధ్దాంతం కూలిపోయిన తెలుగుదేశం భవనాన్ని తిరిగి నిర్మించాలనే ప్రయత్నమే మీ సిధ్దాంతం. ఢిల్లీలో ఉండే నేతలతో మాకు సంబంధాలు ఉన్నాయి.పలుకుబడి ఉంది అంటారు.పలుకుబడి ఉంటే రాష్ర్ట అభివృధ్దికి కృషి చేయండి. ఓ పక్క బిజేపి తో సంబంధాలు నెరుపుతూనే వామపక్షాలతో మాట్లాడుతుంటారు.వారితో కలసి పోటీచేస్తారు. మాపై కుట్రతో కేసులు పెట్టారని భావించి ప్రజలు మమ్మల్ని గెలిపించారని అన్నారు. పవన్ కల్యాణ్..  మీ పార్టీని నడుపుకునే శక్తి లేకపోతే తిరిగి సినిమాలలోకి వెళ్లండి. -మీరు సినిమాలలోకి వెళ్లి పనిచేసే పరిస్దితి వస్తుంది. జగన్  అద్బుతమైన పరిపాలన అందించడం ఖాయం.అందువల్ల మీకు సినిమాలలోకి వెళ్లే ఆలోచన వస్తున్నాయి. జనసేన టిడిపికి బి టీమ్ .చంద్రబాబుకు దత్తపుత్రుడు మీరు. జనసేనను,టిడిపిని కట్టగట్టి సముద్రంలో పడేశారు. చంద్రబాబుకు 23 సీట్లు కాదు 24 సీట్లు అని తేలిపోయింది. భవన నిర్మాణ కార్మికులకోసం వారి సంక్షేమం కోసం పాటుపడతాం. ఆరునెలల్లోనే జగన్  ప్రభుత్వాన్ని ఏదో బ్రాండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అంబటి అన్నారు.

No comments:
Write comments