స్కూల్ బస్ కింద పడి విద్యార్థి మృతి

 

నల్గోండ నవంబర్ 5, (globelmedianews.com)
కొండమల్లేపల్లి మండల పరిధిలోగల దేవరోని తండా గ్రామంలో అదే గ్రామానికి చెందిన విద్యార్థి ఇస్లావత్ అఖిల్( )  అనే విద్యార్థి కృష్ణవేణి స్కూల్ బస్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇస్లావత్ కుమార్, శాంతి ల ముద్దుబిడ్డ అఖిల్ ను కొండమల్లేపల్లి లో గల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో చదువుతుండగా,,,   అదే స్కూల్ కు చెందిన బస్సుపై రోజు వెళ్ళి వస్తూండేవాడు. 
స్కూల్ బస్ కింద పడి విద్యార్థి మృతి

దురదృష్టవశాత్తు మంగళవారం స్కూల్ కి వెళ్లడానికి బస్సు కోసం వేచి ఉండగా బస్సు వచ్చిన సమయంలో బస్సు ఎక్కుతుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా  బస్సు కదిలించడం తో  ప్రమాదం చోటు చేసుకుంది.  విద్యార్థి ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో తండావాసులు జీర్ణించుకోలేకపోయారు.  బస్సు డ్రైవర్ అక్కడినుండి పరారు అయ్యాడు. సంఘటన స్థలానికి కొండమల్లేపల్లి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

No comments:
Write comments